హైదరాబాద్: 28°C
తెలంగాణ

సికింద్రాబాద్‌లో ఆఖరి విమానయానం

HYD: సికింద్రాబాద్ వేదికగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 42 ఏళ్ల క్రితం ఎక్కడైతే ప్రయాణం మొదలైందో అక్కడే ముగిసింది. పదవీ విరమణ అంచున ఉన్న ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ తన మొదటి గురువు వీఎస్ కొచ్చర్తో కలిసి సికింద్రాబాద్లోని అకాడమీలో కిరణ్ విమానంలో ఆఖరిసారిగా గగనవిహారం చేశారు. 1984లో తొలిసారి ఈ విమానం ఎక్కిన ఆయన నేడు అదే గురువుతో ఆకాశంలోకి వెళ్ళారు.