హైదరాబాద్: 28°C
క్రీడలు

డిస్కస్ త్రోలో భారత్ క్లీన్‌స్వీప్

ఆసియా పారా గేమ్స్ డిస్కస్ త్రోలో భారత అథ్లెట్లు సంచలనం సృష్టించారు. ఏకంగా మూడు పతకాలను సాధించి క్లీన్‌స్వీప్ చేశారు. దేవేందర్ కుమార్ స్వర్ణం, రాకేశ్ రజతం, ప్రదీప్ కుమార్ కాంస్యం కైవసం చేసుకుని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ అద్భుత ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.