హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ సిబ్బందికి సత్కారం

SDPT: కోహెడ మండలం మైసంపల్లి గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకుని సర్పంచ్ పకిడే సంపత్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తున్న సిబ్బందికి నూతన వస్త్రాలు అందించి, శాలువాలతో గౌరవించారు. సిబ్బంది సేవలను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందని పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు.