హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణ దుర్గమ్మకు చండీ హోమం

BDK: కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో స్వర్ణ దుర్గమ్మ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, చండీ హోమం, కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి మహాకాళికా దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.