హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగులో ఘనంగా దసరా వేడుకలు

MLG: ములుగు పట్టణంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా బొడ్రాయికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలు, సొరకాయ, గొర్రె పిల్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామదేవతల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. పూజలతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.