SRCL: విజయదశమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అంబారీ సేవ నిర్వహించారు. ఆలయం నుంచి పట్టణ పురవీధుల గుండా సాగిన ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దసరా సంప్రదాయంలో భాగంగా జమ్మి చెట్టు వద్ద ఉత్సవమూర్తులను తీసుకెళ్లి, శాస్త్రోక్తంగా శమీ పూజ నిర్వహించారు. వేడుకలను భక్తులు తిలకించారు.
తెలంగాణ
VIDEO: రాజన్న సన్నిధిలో వైభవంగా అంబారీ సేవ


