హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రావణ దహనం

NZB: సుభాశ్ నగర్ కాలనీలో దేవి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ దహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విజయదశమి పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. రావణ దహనాన్ని తిలకించేందుకు చిన్నారులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది.