హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శమీ పూజ

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం MLA గడ్డం వినోద్ జమ్మి చెట్టుకు శమీ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అన్నారు. ఈ పర్వదినం అందరికీ శుభవిజయాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.