NZB: గోవింద్‌పేట్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శేషవాహనంపై వేణుగోపాల స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం రావణ దహనం నిర్వహించారు. జమ్మి చెట్టుకు పూజలు చేసి పరస్పరం విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
వైభవంగా దసరా ఉత్సవాలు


