హైదరాబాద్: 28°C
తెలంగాణ

అశ్వవాహన సేవలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్

VKB: వికారాబాద్‌ జిల్లాలోని ఆలంపల్లి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన అశ్వవాహన సేవలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఆలయ ఈవో నరేందర్, ఫౌండర్ ట్రస్టీ పద్మనాభం, కౌన్సిలర్ లక్ష్మీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.