హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకున్న రావి ఆకుపై దుర్గమ్మ రూపం

EG: అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన భద్ధిర్రాజు లక్ష్మీ సుప్రజా పార్వతి విజయదశమి సందర్భంగా ప్రకృతిసిద్ధమైన రావి ఆకుపై అమ్మవారి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. త్రిశూలం, ఖడ్గం ధరించి సింహంపై కొలువుదీరిన జగన్మాత రూపాన్ని అత్యంత సూక్ష్మంగా తీర్చిదిద్దారు. తన కళానైపుణ్యంతో రూపొందించిన ఈ కళాఖండం ద్వారా ప్రజలకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు.