PLD: MPTC, ZPTC ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ సంజన తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, చెక్‌పోస్టుల ద్వారా నిరంతర తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు: JC


