MDK: రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో విజయదశమి సందర్భంగా రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా, గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమం గ్రామస్తులను ఆకట్టుకుంది. పలువురు గ్రామస్థులు పాల్గొని వేడుకలను తిలకించారు.
తెలంగాణ
VIDEO: కాట్రియాల్లో రావణ దహనం


