హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడిపల్లి పీఎస్‌లో ఆయుధ, వాహన పూజలు

MDCL: విజయదశమి సందర్భంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయుధ, వాహన పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ డి. జలందర్‌రెడ్డి విధి నిర్వహణలో కీలకమైన ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో వాటి ప్రాధాన్యాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.