హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామగిరి, కనగానపల్లిలో ఎస్పీ సతీష్ కుమార్ ఫ్లాగ్ మార్చ్

SS: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ రామగిరి, కనగానపల్లి మండలాల్లో పోలీస్ బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.