హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నసాగర్‌లో విజయదశమి వేడుకలు

MBNR: భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పార్టీ నాయకులతో కలిసి వేద పండితుల సమక్షంలో ఆంజనేయస్వామి ఆలయంలోని శమీ వృక్షానికి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.