SRD: కంగ్టి మండలం తడ్కల్లో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు ప్రధాన చౌరస్తాలోని హనుమాన్ మందిరం వద్దకు చేరుకుని, డప్పుచప్పుళ్ల నడుమ గ్రామ శివారు ప్రాంతాలకు వెళ్లి పాలపిట్టను దర్శించుకున్నారు. అనంతరం జమ్మి ఆకులు సేకరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మి ఆకులను ఒకరికొకరు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తెలంగాణ
VIDEO: అంబరాన్నంటిన దసరా సంబరాలు


