KNR: రామడుగు మండలం గోపాల్రావుపేటలో విజయదశమి సందర్భంగా మంగళవారం దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగింది. డీజే చప్పుళ్ల నడుమ అమ్మవారి విగ్రహాన్ని గ్రామంలోని వార్డుల గుండా ఊరేగించగా, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రతి ఏటా దసరాకు గ్రామంలోని ఘటాలను సేకరించి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు తెలిపారు.
తెలంగాణ
కన్నులపండువగా దుర్గాదేవి నిమజ్జనం


