హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్ధన్నపేట దసరా వేడుకల్లో వివాదం

WGL: వర్ధన్నపేట పట్టణంలో మంగళవారం దసరా వేడుకల్లో ఘర్షణ చోటుచేసుకుంది. సంప్రదాయంలో భాగంగా సొరకాయ నరికే కార్యక్రమం నిర్వహిస్తుండగా మున్సిపల్ చైర్మన్ కుమారుడు, బీజేపీ నాయకుడు కొండేటి సత్యం మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఒకరినొకరు దుర్భాషలాడుతూ నెట్టుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వేడుకల ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.