హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను ఎస్పీ అమిత్ బర్దార్ మంగళవారం పరిశీలించారు. ఎంపీడీవో, తహసీల్దార్, సీఐతో మాట్లాడి ఏర్పాట్లు, సౌకర్యాలు, ఎన్నికల విధులపై వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.