హైదరాబాద్: 28°C
తెలంగాణ

మదన్‌పల్లిలో విజయదశమి వేడుకలు

NZB: మదన్‌పల్లిలో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పండుగ సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. గ్రామస్థులు, మహిళలు, యువకులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు. గ్రామస్థులందరూ కలిసి శమి చెట్టుకు పూజ చేశారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.