హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిళల కోలాటాలతో శోభాయాత్ర

PDPL: ధర్మారం మండలం మల్లాపూర్‌లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారి గుండా అమ్మవారి శోభాయాత్ర ప్రారంభమైంది. డీజే పాటలు, మహిళల కోలాటాలతో యాత్ర ఉత్సాహంగా సాగింది. భవాని మాలధారులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.