హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇల్లందులో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

BDK: ఇల్లందులో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రూ. 4.11 కోట్ల నిర్మాణం పూర్తి చేసుకున్న మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. అర్బన్ హెల్త్ సెంటర్, మేడికుంట-రామచంద్రపురం వంతెనను సైతం మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే ఉన్నారు.