హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైస్కూల్‌లో రావణాసుర దహనం

MBNR: మిడ్జిల్‌లో విజయదశమి వేడుకలను పురస్కరించుకుని హైస్కూల్ ప్రాంగణంలో రావణాసుర దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ రావణాసుర దహనం చేశారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ధర్మం, సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయనే సందేశాన్ని ఈ వేడుక చాటిచెప్పింది.