హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోళసముద్రంలో వైభవంగా చౌడేశ్వరి అమ్మవారి వేడుకలు

SS: లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపారు. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.