హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ అభివృద్ధికి మరో ముందడుగు

RR: షాద్ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ దేవాలయ ఆవరణలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ పరిసరాలను మరింత అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ లైట్లు ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.