NLR: అయ్యవారిపల్లిలో అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మూడు గేదెలు, ఒక ఎద్దు మృతి చెందాయి. అడవి జంతువుల వేట కోసం పొలాల్లో విద్యుత్ తీగలు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో గోగుల అరుణ, గోగుల ఆదిలక్ష్మికి చెందిన పశువులు మృత్యువాత పడటంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్‌తో నాలుగు పశువులు మృతి


