NLR: బుచ్చిరెడ్డిపాలెం 28వ వార్డులో టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి, కౌన్సిలర్ అభ్యర్థి శ్రీదేవి ఎమ్మెల్యేతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలు తమను గెలిపిస్తే నిజాయితీతో కూడిన పాలన అందిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. పట్టణ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నిజాయితీగల పరిపాలన చేస్తాం


