హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేడుకలు.. జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

RR: ఫరూఖ్‌నగర్ మండలం వెల్‌జర్ల గ్రామంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ ఆర్. బాబు నాయక్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, ఆంజనేయ స్వామి ఆలయంలో పూజల అనంతరం శమీ వృక్షానికి (జమ్మిచెట్టు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు జమ్మి ఆకులు మార్చుకుని, ఆత్మీయంగా అలయ్ బలయ్ తీసుకున్నారు. నియోజకవర్గ, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సర్పంచ్ కోరారు.