NLR: కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారి శ్రీహరి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల జాబితాలు, నామినేషన్ ఫారాలను అందజేశారు. బుధవారం ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: రిటర్నింగ్ అధికారి


