GNTR: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 6వ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణకు సంబంధించి వేదిక, వీఐపీల రాకపోకల మార్గాలు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ


