WG: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఇరగవరం మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని డీఎస్పీ బి. నరసింహరావు మంగళవారం సందర్శించారు. కేంద్రంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను, పోలీసు బందోబస్తు విధులను ఆయన పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఇరగవరం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ


