SDPT: చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం దసరా వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి చెట్టుకు పూజలు చేసి, పాలపిట్టను దర్శించుకున్నారు. అనంతరం జమ్మి ఆకులను ఒకరికొకరు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది.
తెలంగాణ
VIDEO: అంబరాన్నంటిన దసరా సంబరాలు


