WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో దసరా పర్వదినాన్నీ పురస్కరించుకొని ఆయుధ పూజలు నిర్వహించారు. సీపీ శ్వేతా రెడ్డి అర్చకులతో కలిసి దసరా వేడుకలను శాస్త్రోక్తంగా జరిపించారు. పోలీస్ సిబ్బంది, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీపీ దార కవిత, అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆయుధ పూజ


