SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో దసరా పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్ ఆధ్వర్యంలో పాత గడిలోని గడి మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో జమ్మిచెట్టు వద్దకు తీసుకెళ్లి ప్రదక్షిణలు చేశారు. జమ్మి ఆకులను పంచుకుంటూ అలయ్ బలయ్తో పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తెలంగాణ
ఘనంగా దసరా ఉత్సవాలు


