హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బరిలో 16 మంది మేయర్ అభ్యర్థులు

ATP: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మేయర్ పదవికి ఎలాంటి ఉపసంహరణలు లేకపోవడంతో 16 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్లు అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ జశ్వంత రావు తెలిపారు. 62 డివిజన్లలో 12 నామినేషన్లు ఉపసంహరించుకోగా, ప్రస్తుతం 447 మంది బరిలో ఉన్నారని వెల్లడించారు.