KMR: దేశాయిపేట్ విజయదశమి సందర్భంగా దేశాయిపేట్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి యువకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువకులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ జై భవానీ.. జై శ్రీరామ్ నినాదాలు చేశారు. శివాజీ మహారాజ్ స్ఫూర్తితో జాతి నిర్మాణంలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ సేన సమితి సభ్యులు, తదితరులున్నారు.
తెలంగాణ
శివాజీ స్ఫూర్తితో జాతి నిర్మాణానికి కృషి చేస్తాం


