హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిగి జడ్పిటిసి అభ్యర్థిగా సత్య ప్రకాష్

SS: శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కురుబ సత్య ప్రకాష్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపిక చేసింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరిగి మండలం పైడేటి పంచాయతీకి చెందిన సత్య ప్రకాష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.