NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీ పాఠశాల మైదానంలోని జమ్మి చెట్టుకు సర్పంచ్ జోగు రమణమ్మ, ఉపసర్పంచ్ భీమయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులు జమ్మి ఆకులను పంచుకుంటూ అలయ్ బలయ్ తీసుకున్నారు. ప్రజలు నూతన వస్త్రాలు ధరించడంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
తెలంగాణ
తోటపల్లిలో ఘనంగా దసరా వేడుకలు


