WG: నరసాపురం టీడీపీ కార్యాలయంలో మంగళవారం కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు, ఏఎంసీ ఛైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ చేతుల మీదుగా ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. రామరాజు మాట్లాడుతూ.. అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేసి కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత


