హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామంలో వైభవంగా దసరా వేడుకలు

MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరి గ్రామంలో విజయదశమి, దుర్గామాత వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా భజన పరులు చేసిన అడుగుల భజన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా జమ్మి బంగారం ఒకరికొకరు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతోషంగా గడిపారు.