హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహర్షి ఆశ్రమంలో శమీ వృక్ష పూజలు

BPT: బాపట్ల పట్టణంలోని మహర్షి ఆశ్రమం గోశాలలో నిర్వహించిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ముగిశాయి. చివరి రోజు అమ్మవారికి విశేష హోమం, గోపూజ నిర్వహించారు. మహాలక్ష్మి, సరస్వతీ సమేత రాజరాజేశ్వరి దేవికి హరిద్రా కుంకుమార్చన, తీర్థజల అభిషేకం జరిపారు. అనంతరం శమీ వృక్ష పూజ, దీక్షా విరమణ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.