హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: టీడీపీ

GNTR: నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలో నిలుస్తున్న అభ్యర్థులకు జిల్లా పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మంగళవారం పార్టీ కార్యాలయంలో బీ-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లి మద్దతు కూడగట్టాలని సూచించారు. అభ్యర్థులకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి భరోసా ఇచ్చారు.