హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోపాలపురంలో రాజరాజేశ్వరి దేవికి విశేష పూజలు

NTR: ఏ కొండూరు మండలం గోపాలపురంలోని శ్రీ జానకి రామచంద్ర స్వామి వారి దేవాలయంలో విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిరూపంలో పూజలందుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం స్వీకరించారు. ఇవాళ శమీపూజతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని అర్చకులు ఈశ్వరప్రగడ విజయ్ కుమార్ రాజా తెలిపారు.