SS: కొత్తచెరువు మండలం తలమర్ల గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి తెదేపాలో చేరాయి. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు


