CTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పెనుమూరు మండలంలో పోలీసులు ఏరియా డామినేషన్ నిర్వహించారు. నామినేషన్ కేంద్రాల పరిసరాలను పరిశీలించి, 100 మీటర్‌ల పరిధిలో అనుమతి లేని వ్యక్తులు గుమిగూడరాదని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పెనుమూరులో పోలీసుల ఏరియా డామినేషన్


