KRNL: ఆలూరులో వైసీపీ అభ్యర్థిని నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని పత్తికొండ డీఎస్పీ వంశీధర్ గౌడ్ స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం బైండోవర్ చర్యలు చేపట్టేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. ఈ ఘటనలో నామినేషన్ను అడ్డుకోవడం, లాఠీచార్జి చేయడం జరగలేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నామినేషన్ అడ్డుకున్నారన్న ప్రచారం అవాస్తవం'


