హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 450 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం మెక్‌గ్రాత్ (23,474 బంతులు) రికార్డును స్టార్క్ (20,577) బ్రేక్ చేశాడు. అలాగే, టెస్టుల్లో 450 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్‌గా కూడా రికార్డుకెక్కాడు.