TG: ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవంజికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన ఈ విజయం ఎందరో పారా అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చని దీప్తి నిరూపించిందని ప్రశంసించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.
క్రీడలు
దీప్తి జీవంజికి సీఎం రేవంత్ అభినందనలు


