హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్

ఆసియా పారా గేమ్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నిషద్ కుమార్ అద్భుత రికార్డు సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో లాంగ్‌జంప్ (T47) విభాగంలో అతడు ఇప్పటికే స్వర్ణాన్ని గెలవగా, తాజాగా హైజంప్ (T47)లో కూడా స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఒకే ఆసియా పారా గేమ్స్ ఎడిషన్‌లో రెండు వేర్వేరు ఈవెంట్లలో పాల్గొని.. రెండు స్వర్ణ పతకాలు సాధించిన అరుదైన అథ్లెట్‌గా నిలిచాడు.